బలైపోయింది రైతే కదా…?

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో భూమి ఇచ్చి దెబ్బలు తింటున్నాడు రైతు. రాజకీయ పార్టీలు తమ కక్షలతో లేదా తమ ప్రయోజనాలతో రైతులను వాడుకుంటున్నాయి ఈ విషయంలో. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ల్యాండ్ పూలింగ్ అనగానే వాళ్లకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉండటం రైతులు అందరూ స్వచ్చందంగానే ముందుకి వచ్చి భూములు ఇచ్చారు. 33 వేల ఎకరాలు తీసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడా కూడా అలాంటిది జరగలేదు.

సరే అమరావతి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు అందరూ కాకపోయినా మెజారిటి ప్రజలు దాన్ని మాత్రం దాన్ని సమర్ధించింది. విజయవాడ సెంటర్ లో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రభుత్వం రాజధానిని మార్చాలని నిర్ణయం తీసుకోవడం అనేది వివాదాస్పద విషయ౦. అసలు ఎందుకు మారుస్తున్నారు అనేది స్పష్టమైన కారణం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తన నోటి దగ్గర కూడు నాశనం చేస్తున్నారని, కన్న తల్లి లాంటి భూమిని ఇచ్చిన రైతు రోడ్డు ఎక్కాడు. ఇన్నాళ్ళు అమరావతిలో వివాదాస్పద వాతావరణం ఎక్కడా లేదు.

ఇప్పుడు రైతుల మీద పోలీసులు దాడులు చేస్తున్నారు. భూములు ఇచ్చింది చంద్రబాబుకా మరోకరికా కాదు ప్రభుత్వానికి. అలాంటప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్లకి న్యాయం చెయ్యాల్సింది పాలకులే. కాని రైతు మాత్రం దెబ్బలు తింటున్నాడు. భూమి ఇచ్చి రోడ్డున పడ్డాడు. ఇక్కడ చంద్రబాబుని తప్పు పడతామా…? ప్రస్తుత ప్రభుత్వాన్నా అనేది పక్కన పెడితే, అన్యాయం జరుగుతుంది రైతుకే కదా. నా పెళ్ళాన్ని అరెస్ట్ చేసి పోలీసులు కొడుతున్నారని రైతు తల బాదుకుని ఏడ్చాడు అంటే, దాని గురించి ఎం మాట్లాడతాం చెప్పండి. అందుకే రైతుకే అన్యాయం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news