తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా శోభిత ఫోటోషూట్ హాట్ టాపిక్ గా మారింది. దీనికోసం ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ఠ ను ఎంపిక చేసుకోవడం ఆసక్తికరం. సూర్యుని లేలేత కిరణాల తాకిడిలో వెదురు అల్లికలు కుర్చీ పై చాలా ఎనర్జిటిక్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ క్యాప్షన్ లో వైట్ హార్ట్ ఎమోజిలను కూడా షేర్ చేసింది.. ఇకపోతే ఈమె ఫ్యాషన్స్ ఎప్పటికప్పుడు యువతరంలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.. రకరకాల ఫోటోషూట్లతో యువత మతులు పోగొడుతూ వుంటుంది ఈ ముందుగుమ్మ.
ఇకపోతే ప్రముఖ యువ హీరోతో ఎఫైర్ వార్తల్లో నిలిచిన శోభిత దానిని ఎప్పుడు ధృవీకరించలేదు. ఇక కెరియర్ పరంగా కూడా తన శ్రద్ధను కూడా డైవర్ట్ కాకుండా జాగ్రత్త పడుతోంది.. నేటి తరంలో నట ప్రతిభ ఫ్యాషన్ సేన్స్ పరంగా తెలుగమ్మాయి శోభిత ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గురించి యువతరం ముచ్చటించుంకుంటోందంటే.. ఆమెకు ఏ రేంజ్ లో క్రేజీ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు తాజాగా శోభిత వైట్ క్రాప్ టాప్ ధరించి బటన్ లెస్ లుక్ తో కవ్విస్తోంది వైట్ క్రాప్ వైట్ ట్యాంక్ టాప్ ని ధరించి.. బటన్స్ విప్పి మరి యువతకు చెమటలు పట్టించిన ఈమె కేశాలంకరణ ప్రత్యేక ఆకర్షణతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. మొత్తానికి అయితే శోభిత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఈమె బ్రిటిష్ టెలివిజన్ సిరీస్ ది నైట్ మేనేజర్ భారతీయ వెర్షన్ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రచార కార్యక్రమాలలో భాగంగా శోభితతో పాటు సహనటులు ఆదిత్య రాయ్ కపూర్ , అనిల్ కపూర్ కూడా ఉన్నారు. మొత్తానికైతే ప్రస్తుతం తెలుగు అమ్మాయి మోస్ట్ అవైటెడ్ లిస్టులో చోటు సంపాదించుకుందని చెప్పవచ్చు.