సోహైల్‌ : జనాల ట్రెండ్ విచిత్రంగా ఉంది..!!

-

బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్‌ సొంతంగా  కష్ట పడి పైకి వచ్చిన నటుడు. ఇక అంతకు సీరియల్స్ తో కొంత ఫేమ్ సంపాదించిన సోహైల్‌ , ఇక బిగ్ బాస్ షోలో అడుగు పెట్టిన తర్వాత తన ఆట తీరుకు మాట తీరుకు అబిమానులు ఫిదా అయిపోయారు.ఇక ఫైనల్ లో విజేత గా నిలిచిన వారికంటే తనకే ఎక్కువ క్రేజ్ వచ్చింది. తనకు హీరో అయ్యే ఫేమ్ ఉందని చాలా మంది గుర్తించారు.

ప్రస్తుతం తాను హీరో గానటిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. మోక్ష హీరోయిన్ గా నటిస్తోంది.దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డైరెక్టర్ ఎ.ఆర్‌.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా  ఈ డిసెంబర్ 30న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా విజయవంతం గా కండక్ట్ చేశారు..

రీసెంట్ గా జనాల పాజిటివ్, నెగిటివ్ గురించి తాను సంచలన కామెంట్స్ చేశాడు.ప్రస్తుతం జనాలు పాజిటివ్‌ కంటె నెగటివ్‌నే చూసేందుకు ఇష్టపడుతున్నారని, మా ఫాదర్‌ పడ్డ కష్టంపై వీడియో పెడితే ఐదు వందల వ్యూసే వచ్చాయని, అదే స్టేజ్‌పై తాను చేసిన కామెంట్ల వీడియోలకు లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయని, చిరంజీవి సర్‌ వాల్తేర్‌ వీరయ్య ప్రెస్‌మీట్‌ వీడియోలకంటే మా నెగటివ్‌ వీడియోకే ఎక్కువగా వ్యూస్‌ వచ్చాయని ఇలా ఉంది జనాల ట్రెండ్ అంటూ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news