షర్మిల నిర్ణయం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టొచ్చా…?

-

తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు ఇప్పుడు వైయస్ షర్మిల పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె పార్టీలోకి వెళ్లే రెడ్డి సామాజిక వర్గం నేతలు ఎవరూ అనేదానిపై అధికార పార్టీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

అయితే ఖమ్మం జిల్లాకు చెందిన ఒక కీలక రెడ్డి సామాజిక వర్గం నేత షర్మిల తో భేటీ అయ్యారని తెలుస్తోంది. ఆమె తో సమావేశమైన సదరు నేత ఖమ్మం సభకు సంబంధించి ఒక స్పష్టత కూడా ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా నల్గొండ జిల్లా కు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఆమెతో సమావేశమయ్యారు. అలాగే మరికొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కొంతమంది ఆమెతో సమావేశమైనట్లు గా రాజకీయవర్గాలు అంటున్నాయి.

క్రైస్తవ సమాజం ఓట్లు ఆమె వైపు వెళ్లే ఉందని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఆ మతానికి సంబంధించి కూడా కొంతమందిని కూడా షర్మిల టార్గెట్ చేసినట్లుగా ప్రచారం ఊపందుకుంది. మరి ఈ విషయంలో ఎటువంటి అడుగుపడుతుంది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు గనుక షర్మిల రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా టిఆర్ఎస్ పార్టీ ఎక్కువగా నష్టపోవుచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news