దీపావళి పండగ చేసుకున్నారు…

-

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కావాలి అంటే జనతా కర్ఫ్యూ పాటించి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు అందరూ ముందుకి వచ్చి వైద్యులకు కృతజ్ఞత గా చప్పట్లు కొట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇవ్వగానే అందరూ కూడా ఇంట్లో ఉండి చప్పట్లు కొట్టకుండా రోడ్ల మీదకు వచ్చి దాన్ని ఒక పండగలా చేసుకుని గో కోరోనా గో అని నినాదాలు చేస్తూ రోడ్ల మీద తిరిగారు. దీని మీద తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇక ఇప్పుడు కూడా దాదాపుగా ఇదే జరిగింది. దీపాలు వెలిగించాలి అని పిలుపు ఇస్తే ప్రజలు అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి దీపావళి కి తెచ్చుకున్న బాంబులు కాల్చారు. కొంత మంది కొనుక్కుని మరీ కాల్చారు. మరి వాళ్లకు అసలు విషయం అర్ధమైందో లేదో తెలియదు గాని వాళ్ళు చేసిన పనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కొందరు ఇదే చేసారు.

ఏంటో దీపావళికి వెలిగించినట్టు దీపాలు వెలిగించి కొందరు మతాబు లు కాకర పువ్వోత్తులు కాల్చడం గమనార్హం. దేశంలో చాలా మంది ఇలాగే చేసారు. మరి వాళ్లకు అసలు మైండ్ ఉందో పోయిందో తెలియదు గాని అందరూ కూడా ఇలాంటిది చేసారు. రోడ్ల మీదకు వచ్చి దీపాలు కొవ్వొత్తులు వెలిగించి పట్టుకున్నారు కొందరు. దాన్ని ఒక పండగలా చేసారు గాని పోరాటం మాదిరిగా ఎవరూ కూడా చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news