ఏపీలో ఏదో కుట్ర జరుగుతోంది: సోము వీర్రాజు

-

సమైక్య రాష్ట్రంపై ఉండవల్లి, సజ్జల వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్రంలో ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం వస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీ ప్రజలపై అనవసర చర్చను రుద్దేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. విభజన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి.. ముగిసిన చర్చకు ఆజ్యం పోయాలని చూస్తున్నారని విమర్శించారు సోము వీర్రాజు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించిందని సంతోషం వ్యక్తం చేశారు. గుజరాత్ లో మరోసారి బీజేపీ జెండా రెపరెపలాడింది. బీజేపీ అద్భుత విజయం సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో పలువురు కేంద్ర మంత్రులను ఢిల్లీలో స్వయంగా కలసి వినతి పత్రాలు ఇచ్చిన సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి ఎలా ఉంటుందని నిరూపించి అభివృద్ది నినాదంతో గుజరాత్ విజయం ఆల్ టైమ్ రికార్డ్ గా గుజరాత్ రాజకీయాల్లో కొత్త చరిత్రను సృష్టించడం జరిగిందని సోమువీర్రాజు పేర్కొన్నారు.

Somu Veerraju counters Chandrababu's remarks on alliances, says don't need  anyone's sacrifices

ఏడు పర్యాయాలు వరుస విజయాలే కాదు గెలుపొందిన స్ధానాల్లో మెజార్టీలు కూడా పెరగడమే ఈ విజయాలు వెనుక ప్రజలు ఏవిధంగా మద్దతు పలుకుతున్నారనేది అర్ధం చేసుకోవాలన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక కుట్ర జరుగుతోంది. అవశేషాంధ్రప్రదేశ్ గా ఏర్పడిన తరువాత మాజీ ఎంపి ఉండవల్లి అందుకు కౌంటర్ గా సజ్జల రామక్రుష్ణారెడ్డి వ్యాఖ్యలు పరిశీలిస్తే అనవసర చర్చ ను ఎపి ప్రజల పైరుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎపి ప్రజలు గుజరాత్ ఫలితాలను ఆస్వాదిస్తున్న తరుణంలో విభజన అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చి మీడియాలో అనవసర చర్చకు ఆజ్యం పోయాలని చూస్తున్నారని సోమువీర్రాజు విడుదల చేసిన ప్రకటనలో వైసీపీ అనుసరిస్తున్న తీరును ఆక్షేపించారు.

Read more RELATED
Recommended to you

Latest news