రాయలసీమ ప్రజలకు సోము వీర్రాజు క్షమాపణలు.. ఆ పదాలు వాడటం నా తప్పే !

-

గత రెండు రోజుల క్రిందట రాయలసీమ ప్రజల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. హత్యలు చేసే కడప జిల్లా ప్రజలకు ఎయిర్ పోర్టులు ఎందుకంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలతో రాయలసీమ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అయితే తాజాగా ఆ వ్యాఖ్యలపై సోము వీర్రాజు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

రాయలసీమ రతనాల సీమ ఈ పదం నాహృదయంలో పదిలమని.. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు విమర్శించే విషయంలో నేను వాడిన పదాలు వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయని పేర్కొన్నారు సోము వీర్రాజు. ఈ పదాలు వాపసు తీసుకుంటున్నాను.. ఈవిషయంలో క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు.

నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు అన్నారు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టులు విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించానని.. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలనేది బీజేపీ ఆలోచన అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news