జగన్ ట్రాపులో పడకుంటే..చంద్రబాబు బీజేపీతోనే ఉండేవారని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం కోసం చంద్రబాబు అదనంగా అడిగిన రూ. 25 వేల కోట్లనే ఇప్పుడు జగన్ అడుగుతున్నారని.. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిందా..? అని ఫైర్ అయ్యారు.
పోలవరం ఆర్ అండ్ ఆర్ వివరాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దొరికిపోతుందని.. పోలవరం ఆర్ అండ్ ఆర్ వివరాలిస్తే.. కేంద్రం పరిశీలించి నిధులు ఇస్తుందని పేర్కొన్నారు. సీఎం జగన్ తాను చేయాల్సింది చేయకుండా.. మమ్మలని అంటారా..? జగన్ అనుకునే డబ్బు మిషన్లు బీజేపీ వద్ద ఉండవని మండిపడ్డారు.
పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలను ముంచకండని.. పోలవరం పై చిత్తశుద్ధి ఉంటే.. అన్ని లెక్కలు సమర్పించండని డిమాండ్ చేశారు. నాటి సీఎం చంద్రబాబు జగన్ ట్రాపులో పడకుంటే.. బీజేపీతోనే ఉండేవారు… రాజధాని నిర్మాణం చేయకుండా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నిధులిచ్చిందని.. అమరావతి స్మార్ట్ సిటీకి ఈ డబ్బును వినియోగించ లేదన్నారు.