సలార్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. రిలీజ్ డేట్ లాక్..!!

-

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మూవీ కి సంబంధించిన తాజా అప్డేట్ బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ అప్డేట్ చూసి ప్రభాస్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సలార్ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయన సరసన హీరోయిన్ శృతిహాసన్ నటిస్తున్నది . ఇకపోతే జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాను తెలంగాణలోని గోదావరి ఖని సమీపంలో చిత్రీకరించినట్లు అధికారికంగా కూడా గతంలో ప్రకటించారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే విడుదల తేదీని ప్రముఖ కాంట్రవర్సర్ ఉమర్ సందు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వచ్చే ఏడాది అనగా 2023 ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు అని ఉమైర్ సందు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన థియేటర్ లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కరోనా కారణంగా ఒక సంవత్సరం పాటు వాయిదా వేసి వచ్చే యేడాదికి ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేస్తున్నామని ప్రకటించడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా కోసం మరో 9 నెలల పాటు ఎదురు చూడక తప్పదు.

ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే అలాగే ఆది పురుష్ రెండు సినిమా షూటింగ్ లు కూడా శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ తన కాలికి సర్జరీ చేయించుకోవడానికి విదేశాలకు వెళ్ళినట్లు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ మీడియాతో వెల్లడించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే షూటింగ్ పూర్తి చేస్తామని త్వరలోనే ప్రాజెక్ట్ కే సినిమాను కూడా విడుదల చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news