సీఎం జ‌గ‌న్‌కు సోమువీర్రాజు లేఖ

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ర‌జాక్ చ‌క్ర‌వ్యూహంలో శ్రీ‌శైలం పుణ్య‌క్షేత్రం విల‌విల‌లాడుతోంద‌ని పేర్కొన్నారు. సీఎం జ‌గ‌న్ వెంట‌నే జోక్యం చేసుకోవాల‌న్నారు. శ్రీ‌శైలం పుణ్య‌క్షేత్రానికి ర‌జాక్ అనే వ్య‌క్తి ఒక శాప‌గ్ర‌త‌స్తంలా త‌యార‌య్యాడు. అత‌ని అరాచ‌కాల‌ను ఎద‌రిస్తే ప‌దుల సంఖ్య‌లో కేసులు పెట్టించ‌డం ద్వారా అక్క‌డి వారిని భ‌యబ్రాంతుల‌కు గురి చేస్తున్నాడు.

ఈ ఘ‌ట‌న‌ల‌కు ఎదిరించి హైంద‌వ ధ‌ర్మానికి అండ‌గా ఉన్న బీజేపీ నేత బుడ్డా శ్రీ‌కాంత్‌రెడ్డిపై కేసులు బ‌నాయించారు. రజాక్‌కు అక్క‌డి ఎమ్మెల్యే అండ‌గా ఉండ‌డంతో పోలీస్‌, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు ర‌జాక్ చెప్పిన‌ట్టే చేస్తున్నారు. శ్రీ‌శైలంలో రాజ్యాంగానికి చోటు లేని విధంగా ర‌జాక్ ఆగ‌డాలు కొన‌సాగుతున్నాయి. ఆల‌యాల ద‌ర్శ‌న యాత్ర‌లో నేనే స్వ‌యంగా ఈ విష‌యాల‌ను తెలుసుకుని బాహ్య ప్ర‌పంచానికీ తెలియ‌జేశాను.

స్థానిక అధికారులు ర‌జాక్ ఆగ‌డాల‌ను అడ్డువేయ‌లేక పోతున్నందుకే ఈ విష‌యాల‌ను మీ ముందుకు ఈ లేఖ ద్వారా తీసుకొస్తున్నాన‌ని పేర్కొన్నారు సోము వీర్రాజు. ప‌విత్ర‌మైన వైద్య వృత్తిలో ఉన్న డాక్ట‌ర్ బుడ్డా శ్రీ‌కాంత్‌రెడ్డిపై కేసులు ఏవిధంగా బ‌నాయిస్తున్నారు. ఒక డాక్ట‌ర్‌పై ప‌దుల సంఖ్య‌లో కేసులు పెట్ట‌డానికి ప్ర‌భుత్వానికి సిగ్గు అనిపించ‌డం లేదా..? ఇప్ప‌టికైనా బుడ్డా శ్రీ‌కాంత్‌పై పెట్టిన కేసులు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని కోరుతున్న‌ట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news