నాడు చేసిన వాగ్థానాలను తప్పకా నెరవేరుస్తా…సోనియా గాంధీ

-

తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మేడ్చల్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా వేధిక నుంచి మాట్లాడుతూ… మిమ్మల్ని చూస్తుంటూ చాలా కాలం తరువాత తన బిడ్డలను చూసిన తల్లికి కలిగే ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నానన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వచ్చిన తనకు లభించిన స్వాగతానికి అభినందనలు తెలిపారు. నాడు రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటాల  కారణంగా  తెలంగాణ ఏర్పాటు చాలా కష్టసాధ్యమనుకున్నా.. కానీ ఆ పని సులువుగా చేయగలిగామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ఏళ్ల నాటి  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేశామన్నారు.

కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతోందని తెలిసినా సరే…రాష్ట్ర ఏర్పాటుని ఎక్కడా ఆపలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం బాధ్యతగా భావించామన్నారు. నాడు పార్లమెంటు సాక్షిగా చేసిన వాగ్థానాలను తప్పకా నెరవేరేస్తామని సోనియా ప్రకటించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ జనం ఉద్యమించి సాధించుకున్నారు. కానీ వారి కలను సాకారం చేయడంతో తెరాస ప్రభుత్వం విఫలమైంది.

సోనియా గాంధీ సాహసం చేశారు…

రాష్ట్రం ఏర్పాటులో సోనియా గాంధీ ఎంతో సాహ‌సం చేశార‌ని తెజస అధినేత ప్రొ.కోదండ‌రాం అన్నారు. పసి పాప లాంటి తెలంగాణకు అవసరమయ్యే పాలను కేసీఆర్ అందించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు… తెరాస నాలుగున్న‌రేళ్ల‌లో తెలంగాణ‌కు చేసింది ఏమీలేద‌ని విమ‌ర్శించారు. మూడెక‌రాల భూమి రాలేదు…డ‌బుల్‌బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు తెలంగాణ విభజన సమయంలో సోనియా గాంధీ ఆలోచించి…సాహసోపేతమైన చర్యతీసుకున్నారని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా నాడు సోనియా అనుభవించిన పరిస్థతిని కళ్లారా చూశానని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news