తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండో సారి జరగనున్న ఎన్నికల్లో మరోసారి తెలంగాణ ప్రజలు తెరాస కే పట్టం కట్టనున్నారని టైమ్స్‌నౌ ప్రీ పోల్స్ సర్వే లో వెల్లడించింది. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో తెరాస 70 సీట్లను గెలుచుకోనున్నట్టు వెల్లడించింది. కాంగ్రెస్ 31 స్థానాల్లో, టీడీపీ 2, ఎమ్‌ఐఎమ్ 8, బీజేపీ 3, ఇతరులు 5 చోట్ల విజయం సాధిస్తారని సర్వేలో తెలిపింది. మరో వైపు తెరాసను ఓడించమే లక్ష్యంగా ఏకమైన అన్ని పార్టీలకు ఊహించని దెబ్బ తగలనుందని పేర్కొన్నారు. తెరాసకు ఓట్ల శాతాంతో పాటు గతం కంటే సీట్లు కూడా గణనీయంగా పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కంటే తెచ్చిన కేసీఆర్ నే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నట్లు వెల్లడించింది. 2014లో టీఆర్‌ఎస్‌కు 63 సీట్లు రాగా, రానున్న ఎన్నికల్లో 70 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. టైమ్స్ నై సీఎన్‌ఎక్స్ ప్రీ పోల్ సర్వేను నవంబర్ 12 నుంచి 18న మధ్య నిర్వహించారు. రాహుల్ గాంధీ – చంద్రబాబు నాయుడు ల పొత్తును అధిక శాతం ప్రజలు వ్యతిరేకించినట్లు తేలింది.
శాతాల వారీగా ఓట్లు… 2014 నాటికి నేటికి
2014 లో తెరాస 34.30 శాతం ఓట్లు రాగా, ఈసారి 37.55 శాతం రానున్నట్లు సర్వేలో తేలింది. తెదేపాకి 2014లో 14.70 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 5.66 శాతం ఓట్లే వస్తాయని తేలింది. ఆ పార్టీ ఓట్ల శాతం 9.04 శాతం తగ్గుతోంది.
ముఖ్యాంశాలు..
కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా మరోసారి 45.27 శాతం ప్రజలు కోరుకోగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి 30.55, కోదండరాంకు 3.37 శాతం మద్దతు లభించింది. తెరాసకు 37.55 శాతం ఓట్లు , కాంగ్రెస్‌కు 27.98 శాతం,తెదేపా 5.66, ఎమ్‌ఐఎమ్‌కు 4.10 శాతం, భాజపాకి 11 శాతం, ఇతరులకు 13.71 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీతో టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని 52.44 శాతం ప్రజలు వ్యతిరేకించినట్లు సర్వేలో వెల్లడైంది.