రియల్ హీరో సోనూసూద్ ఆస్తులపై ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన నివాసానికి చేరుకున్న ఐటీ శాఖ అధికారులు… ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ముంబైలోని ఆయన నివాసం తో పాటు…. నాగపూర్ జైపూర్ లలో ఏకకాలంలో ఐటి దాడులు జరిగాయి. అంతేకాదు సోనూసూద్ ఏకంగా రూ. 20 కోట్ల పన్ను ఎగవేసిన ట్లు ఐటీ శాఖ స్పష్టం చేసింది.
వేర్వేరు వ్యక్తులు మరియు సంస్థలు పేరుతో సోనూసూద్ అకౌంట్ లో తాము గుర్తించినట్లు ఐటీ శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. సోనూసూద్ అకౌంట్లో చాలావరకు తప్పుడు రుణాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే… ఐటీ అధికారులు చేసిన ఆరోపణలపై సోనూసూద్ ఎట్టకేలకు స్పందించారు. ” ఇండియా ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా నాకు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. నా ఫౌండేషన్ లోని ప్రతి రూపాయి నిరుపేదల విలువైన జీవితాల కోసం పొదుపు చేసిందే. అంతేకాదు.. మానవతా కారణాలతో కొన్ని బ్రాండ్లను సైతం ప్రోత్సహించాను. గత నాలుగు రోజులుగా నేను నా అతిథుల తో బిజీగా ఉన్నాను. అందుకే మీ సేవలో ఉండలేకపోయాను. నేను మళ్లీ మీ జీవితాల కోసం తిరిగివచ్చాను” అంటూ సోసూసూద్ ఐటీ దాడులపై క్లారిటీ ఇచ్చాడు. తనకు పన్ను ఎగవేతకు ఎలాంటి సంబంధం లేనట్టు సోనూసూద్ పేర్కొన్నారు.
“सख्त राहों में भी आसान सफर लगता है,
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY— sonu sood (@SonuSood) September 20, 2021