సోనూ సూద్ సొమ్మంతా పోగేసింది అక్కడినుంచేనా !

-

కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసే వారిని చాలామందిని చూశాం. కానీ సోనూ సూద్ స్థాయిలో ఆదుకోవటం అంత తేలిక కాదు. ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి.. వలస కార్మికుల్ని స్వస్థలాలకు పంపించాడు.. వేలాది మందికి ఆపద్భాందవుడయ్యాడు..అయితే ఈ సొమ్మంతా ఆయనకు ఎక్కడినుంచి వచ్చింది ఎలా పోగేశారు..

వలస కార్మికులకు సాయంతో ఆగలేదు..ఆ తర్వాత కూడా అనేకమంది పేదల విద్య, వైద్య ఖర్చులు కూడా భరిస్తున్నారు. అడిగిన వారికి కాదనకుండా తనవంతు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే నెటిజన్లు ఆయన్ను రియల్ హీరోగా కొలుస్తున్నారు.

సోనూ సాయం చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, దానికి ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుకున్నారనేది కొత్తగా వెల్లడైన విషయం. ప్రజలకు సాయం చేయడం కోసం సోను తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టారట. రూ.10 కోట్ల విరాళం పోగుచేయడానికి ముంబయి జుహూలోని తన ఎనిమిది ఆస్తుల్ని సోనూ తాకట్టు పెట్టినట్లు సమాచారం. ఇందులో రెండు దుకాణాలు, ఆరు ఫ్లాట్లు ఉన్నాయట. సెప్టెంబరు 15న ఈ అగ్రిమెంట్లపై సంతకం చేశారని, నవంబరు 24న రిజిస్ట్రేషన్ జరిగిందని సమాచారం.

ఎవరు ఏ సాయం అడిగినా కాదనని సోనూ, తన వంతు సహాయం చేసేందుకు ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ, స్టార్ హీరోలుగా వెలిగిపోయేవారు కూడా చేయలేని పనులను సోను చేశారు. ఈ నేపథ్యంలో, సోనూకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఏర్పడ్డారు. అయితే, ఈ సహాయకార్యక్రమాలన్నీ ఆస్తులు తాకట్టు పెట్టి చేశాడని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news