లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది పేదలను తమ తమ గమ్యస్థానాలకు తీర్చి రియల్ హీరో గా మారాడు సోను సూద్.. వాళ్లని ఇళ్ళకు చేర్చడమే కాక ఎవరు తమ కష్టమని ముందుకు వచ్చినా వారి కష్టాలు తీర్చేస్తున్నాడు ఆయన. ప్రస్తుతానికి ఆయన క్రేజ్ పీక్స్ లో ఉంది. ఏకంగా తెలంగాణలో ఆయనకు గుడి కట్టించారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన సడన్ గా తన పేరిట ఏర్పాటు చేసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో మెరిశాడు.
వివరాల్లోకి వెళితే హైదరాబాదులోని బేగంపేట కు చెందిన అనిల్ అనే యువకుడు లాక్ డౌన్ అనంతరం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి దానికి తాను అభిమానిస్తున్న సోనూ సూద్ పేరు పెట్టాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి సోనూసూద్ దాకా వెళ్ళింది. దీంతో అనిల్ ను కలవాలని భావించిన సోనూసూద్ ఎవరికీ చెప్పా పెట్టకుండా సదరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. అంతే కాదు తానే స్వయంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తిని అనిల్ అలాగే అక్కడ ఉన్న మరి కొంత మందికి తినిపించాడు.. సోనూసూద్ స్వయంగా తన షాప్కి వచ్చాడని తెలుసుకున్న అనిల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.