బ్రేకింగ్ : ఎం ఐ ఎం నేత కాల్పుల్లో గాయపడ్డ వ్యక్తి మృతి

-

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొద్ది రోజుల క్రితం కాల్పుల కలకలం రేపిన సంగతి తెలిసిందే. అదిలాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఫారుక్ ఒక ముగ్గురు మీద కాల్పులు జరిపిన సంగతి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే ఆ కాల్పుల ఘటనలో గాయాలపాలైన జమీర్ చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడు. నిజానికి అదిలాబాద్ జిల్లాలో కేంద్రంలోని పట్టణంలో ఫారుక్ ఇంటి వద్దనే జమీల్ కుటుంబం కూడా నివసిస్తూ ఉండేది ముందు నుంచి వీరంతా ఎంఐఎం పార్టీలో ఉండేవారు,

కానీ గత ఎన్నికల సమయంలో జమీర్ కుటుంబం టిఆర్ఎస్ పార్టీలో చేరింది. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. అయితే కాల్పుల ఘటన జరిగిన రోజు ఒక క్రికెట్ బంతి వివాదానికి దారి తీసింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయిన ఫారుక్ జమీర్ సహా మరో ఇద్దరో మీద కాల్పులు జరిపారు. జరిపింది లైసెన్స్ తుపాకీ తోనే అయినా రక్షణ కోసం వాడాల్సిన తుపాకీని ఇతరుల ప్రాణాలు తీయడానికి వాడడంతో అతన్ని అరెస్టు చేశారు. సుదీర్ఘంగా ప్రాణాల కోసం పోరాడిన ఈరోజు ఉదయం హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించాడు.

Read more RELATED
Recommended to you

Latest news