పుట్టినరోజు సందర్బంగా మరో మంచి పనికి శ్రీకారం చుట్టనున్న సోనూసూద్..!

-

బాలీవుడ్ రియల్ హీరో సోనూసూద్ పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా ఆయన మరో మంచి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు సోనూసూద్ ప్రకటించారు. ఈ వైద్య శిబిరాల ద్వారా 50 వేల మందికి సేవలు అందించనున్నట్టు తెలిపారు. ఈ వైద్య శిబిరాలను నిర్వహించేందుకు గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులతో ఆయన ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. పూర్తి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని సోనూసూద్ చేపట్టనున్నారు.

సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు.ఇప్పటికే  ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఒడియా రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి అక్కడి డాక్టర్లతో మాట్లాడుతున్నట్లు సోను సూద్ తెలిపారు. ఈ పుట్టినరోజును సోనూ సూద్.. తన జీవితంలో ఒక ప్రత్యేక రోజుగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇవి ఎప్పుడూ నిర్వహించే వైద్య శిబిరాల మాదిరిగా ఉండవని.. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి కాబట్టి కాస్త ఇబ్బంది ఉండొచ్చని సోనూసూద్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news