కరోనా ప్రభావం దేశంలో మొదటగా ప్రారంభం అయినప్పటి నుంచి బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రజల పాలిట దేవుడయ్యాడు. రీల్ లైఫ్‌లో విలన్‌గా అనేక పాత్రలు పోషించినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం ఆయన హీరో అయ్యాడు. ఇప్పటికీ ఆయన సహాయం చేస్తూనే ఉన్నారు. అవసరం అయిన వారికి మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర సదుపాయాలను అందిస్తున్నారు. అలాగే గతంలో ఆయన ఆర్థిక సహాయం అవసరం ఉన్నవారికి, ఉపాధి అవసరం ఉన్నవారికి సహాయం చేశారు. అయితే సోనూసూద్‌ను ఆదర్శంగా తీసుకున్న ఓ వ్యక్తి ఆయన పేరిట ఓ మటన్‌షాప్‌ను నిర్వహిస్తూ సోనూసూద్ ఫౌండేషన్ కు తన వంతు విరాళం అందిస్తున్నాడు.
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మటన్ షాపు నిర్వహిస్తున్నాడు. అక్కడ అతను సోనూసూద్ ఫోటోను కూడా ఏర్పాటు చేశాడు. తన దగ్గర మటన్ కేజీ రూ.700 ఉండగా, అందులో రూ.650 మటన్‌కు తీసుకుంటూ మిగిలిన రూ.50 సోనూసూద్ ఫౌండేషన్‌కు విరాళంగా అందిస్తున్నాడు. ఇందుకు గాను అతను సోనూసూద్ ఫోటోను షాప్ దగ్గర పెట్టాడు.
A Mutton Shopowner in Telangana pledges a share in his profits to Sonu Sood Foundation,
"I am A Vegetarian and Mutton Shop on my name?. Can I help him setup something Vegetarian?," Sonu Sood said on a Lighter Vein. #SonuSood pic.twitter.com/lYz84nPxxm— Sonu Sood Trends (@sonusoodtrends) May 30, 2021
అయితే ఆ ఫొటో సోనూసూద్ దాకా వెళ్లింది. దీంతో ఆయన స్పందించారు. తాను వెజిటేరియన్‌ను అని, తన పేరిట మటన్ అమ్మవద్దని, కావాలంటే ఇంకా ఏదైనా అమ్ముకోండి.. అంటూ సోనూసూద్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. అయితే సోనూసూద్ పేరిట ఆ వ్యక్తి మటన్ అమ్మడం లేదని, తనకు వచ్చేదాంట్లో సోనూసూద్ ఫౌండేషన్‌కు విరాళంగా అందజేస్తున్నాడని, అందుకనే అతను సోనూసూద్ ఫొటోను పెట్టాడని, కొందరు సోనూసూద్‌కు విషయాన్ని వివరించి చెప్పారు. దీంతో అందరూ ఆ వ్యక్తిని ప్రశంసిస్తున్నారు.