ఆదాయపు పన్ను శాఖ బ్యాంకింగ్ కస్టమర్లకు ఓ శుభవార్త చెప్పింది. ఇకపై ఎవరైనా సరే కేవలం 10 నిమిషాల్లోనే ఆధార్ కార్డును పొందవచ్చు.
మన దేశంలో ఎవరైనా సరే ఆర్థిక లావాదేవీలను నిర్వహించేందుకు పాన్ కార్డు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున జరిపే ఆర్థిక లావాదేవీలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కస్టమర్లను పాన్ కార్డు అడుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో పాన్ కార్డు లేకపోతే చాలా ఇబ్బందే. దీంతో చాలా మంది అవస్థలు పడుతుంటారు. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు తీరనున్నాయి. ఎందుకంటే పాన్ కార్డును ఇకపై దరఖాస్తు పెట్టుకున్న కేవలం 10 నిమిషాల్లోనే ఇవ్వనున్నారు.
ఆదాయపు పన్ను శాఖ బ్యాంకింగ్ కస్టమర్లకు ఓ శుభవార్త చెప్పింది. ఇకపై ఎవరైనా సరే కేవలం 10 నిమిషాల్లోనే ఆధార్ కార్డును పొందవచ్చు. అందుకుగాను కస్టమర్లు ఆ శాఖ తెలిపే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ కేవైసీతో కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. దీంతో కేవైసీ పూర్తయ్యాక 10 నిమిషాల్లో వర్చువల్ ఈ-పాన్ కార్డును వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో ఇలా ఈ-పాన్ కార్డు పొందేలా కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
అయితే సదరు ఈ-పాన్ కార్డును కస్టమర్లు పీడీఎఫ్ రూపంలో పొందుతారు. దానిపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేయడం ద్వారా పాన్ కార్డు వివరాలను వెరిఫై చేయవచ్చు. కాగా ప్రస్తుతం ఉన్న విధానంలో కొత్తగా పాన్ కార్డును పొందాలంటే వినియోగదారులకు కనీసం 20 రోజుల సమయం పడుతుంది. దీంతో ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను నిర్వహించేటప్పుడు పాన్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకనే అలాంటి వారి కోసం త్వరలో ఈ-పాన్ కార్డులను ఇవ్వనున్నారు. అప్లయి చేసుకున్న 10 నిమిషాల్లోనే వారు ఆ కార్డులను పొందవచ్చు. అయితే అదే కార్డును ఫిజికల్‌గా కావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది. ఇక ఈ నూతన విధానం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి..!