హెలికాప్టర్ టాక్సీని ప్రారంభించిన ఉబెర్.. చార్జీ ఎంతో తెలుసా?

873

హెలి ఫ్లయిట్ అనే కంపెనీతో డీల్ కుదుర్చుకొని హెలికాప్టర్ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం రోజుకు 8 నుంచి 10 సర్వీసుల వరకు నడుపుతోంది. మాన్ హట్టన్ నుంచి కెన్నడీ ఎయిర్ పోర్టుకు ఈ హెలికాప్టర్ ద్వారా వెళ్తే పట్టే సమయం 8 నిమిషాలు.

ఉబెర్.. ఈ పదం ఇండియన్స్ కు కూడా సుపరిచితమే. ఉబెర్ టాక్సీలు ఇండియాలో ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. బైక్ టాక్సీలు, కారు టాక్సీలు అంటే సహజమే. కానీ.. తాజాగా ఉబెర్.. హెలికాప్టర్ టాక్సీలను ప్రారంభించింది.

యూఎస్ లోని న్యూయార్క్ లో ఉన్న మన్ హట్టన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్ పోర్ట్ వరకు హెలికాప్టర్ టాక్సీల సర్వీసులను ఉబెర్ అందిస్తోంది. అయితే.. ప్రస్తుతం ఈ సర్వీసులు ఉబెర్ డైమండ్, ప్లాటీనం కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే అందరికీ అవి అందుబాటులోకి
వస్తాయని ఉబెర్ పేర్కొన్నది.

హెలి ఫ్లయిట్ అనే కంపెనీతో డీల్ కుదుర్చుకొని హెలికాప్టర్ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం రోజుకు 8 నుంచి 10 సర్వీసుల వరకు నడుపుతోంది. మాన్ హట్టన్ నుంచి కెన్నడీ ఎయిర్ పోర్టుకు ఈ హెలికాప్టర్ ద్వారా వెళ్తే పట్టే సమయం 8 నిమిషాలు. ఆ 8 నిమిషాల సమయానికే 15 వేల దాకా చార్జ్ చేస్తున్నారు. ఒక హెలికాప్టర్ లో ఐదుగురు ప్రయాణికులు వెళ్లొచ్చు.

కొన్ని రోజులు ఈ సర్వీసులకు ఉన్న డిమాండ్ ను చూసి.. తర్వాత యూఎస్ మొత్తం హెలికాప్టర్ టాక్సీలను విస్తరించాలని ఉబెర్ భావిస్తోంది. అలాగే.. ఇతర దేశాల్లోనూ ఈ టాక్సీలను త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇండియాలో కూడా ఎయిర్ టాక్సీలు వస్తాయా? అంటే ఉబెర్ నుంచి ఎటువంటి ప్రకటన లేదు కానీ.. భారత్ లో కూడా ఉబెర్ టాక్సీలు ఉన్నాయి కాబట్టి… ఎయిర్ టాక్సీలను కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది.