దక్షిణాఫ్రికా క్రికెట్ ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి బాన్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి బాన్ చేసే అవకాశాలపై ఇప్పుడు ఐసిసిలో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం క్రికెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. ఇటీవల క్రికెట్ బోర్డ్ ని ప్రభుత్వంలో విలీనం చేసారు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. క్రికెట్ బోర్డ్ వ్యవహారాల్లో వాస్తవానికి ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు.
కాని సౌత్ ఆఫ్రికా క్రికెట్ లో పరిస్థితి భిన్నంగా ఉంది. అంతే కాకుండా ఆ బోర్డ్ లో ఉన్న సీనియర్ అధికారుల ప్రవర్తన కూడా వివాదాస్పదం అయింది. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ కారణాలతో బాన్ చేసే అవకాశం ఉండవచ్చు. పాలక మండలి ప్రకారం ప్రభుత్వ జోక్యాన్ని నిషేధిస్తుంది మరియు జాతీయ క్రికెట్ బాడీ మళ్లీ స్వతంత్రంగా పనిచేసే వరకు శిక్ష సాధారణంగా ఉంటుంది.