రాములమ్మ హస్తం పార్టీకి హ్యాండ్‌ ఇచ్చినట్లేనా…?

-

సినిమా రంగంలో లేడీ అమితాబ్ గా పెరు తెచ్చుకున్న విజయ శాంతి రాజకీయంగా ఆ స్థాయి లో రాణించలేకపోయారు. దీనికి కారణం నిలకడ లేకపోవటమా? రాజకీయ ఎత్తుగడలు పనిచేయకనా అనే చర్చ పాతదే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రాములమ్మ తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ గూటికి చేరారు. మొదట కాంగ్రెస్ లో తనదైన పాత్ర పోషించిన ఆమె మెల్లమెల్లగా సైలెంట్ అవుతూ వచ్చారు. ముందస్తు ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో విజయశాంతి కీలక పాత్ర పోషించారు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం లో కాంగ్రెస్ అధికారానికి దూరం అవ్వడంతో విజయశాంతి యాక్టివ్‌ పాలిటిక్స్ కి దూరమయ్యారు.

అడపాదడపా పార్టీ సమావేశాలకి వచ్చినా, ఈ మధ్య వాటికి కూడా దూరం అయ్యారు, మహేష్ బాబు సరి లేరు నికెవ్వరూ సినిమాలో మళ్ళీ వెండి తెర పై కనిపించిన రాములమ్మ మళ్ళీ సినిమా రంగం వైపు వెళ్తారని టాక్ మొదలయింది, కానీ అదీ జరగలేదు. దీంతో రాజకీయాలకు సినిమాలకు కి విజయ శాంతి ఎందుకు దూరంగా ఉంటున్నారనే చర్చ కూడా జరిగింది

కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జి ఠాగూర్ వచ్చాక మొదటి సమావేశానికి హాజరు కావాలని కబురు వెళ్ళింది, కానీ రాములమ్మ ఆ సమావేశానికి డుమ్మా కొట్టింది, అంతకు ముందు ఆహ్వానం లేకనే రాలేదని చెప్పేది. కానీ, ఠాగూర్ వచ్చాక ఆహ్వానం అందినా సమావేశానికి మాత్రం వెళ్లలేదు. సాధారణంగా కాంగ్రెస్ లో కొత్త ఇంచార్జి రాగానే నేతలంతా వెళ్లి కలుస్తారు. కానీ, విజయ శాంతి కలవకపోవడంతో ప్రత్యామ్నాయ రాజకీయంపై దృష్టి పెట్టిందనే చర్చ కూడా జరిగింది

అయితే ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజయశాంతి తో భేటి వెనుక రాజకీయ కారణమే ఉంటుందనే టాక్‌ నడుస్తోంది. విజయశాంతికి బీజేపీ అగ్ర నాయకత్వం తో మంచి సంబంధాలే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్టు ఉంటూ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో భేటి కావడం తన రాజకీయాల భవిష్యత్తు మలుపు తీసుకోవటంలో భాగమే అనే టాక్‌ గట్టిగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news