సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా ప్రేక్షకులను కలచి వేస్తోంది.సూపర్ స్టార్ కృష్ణ 350కిపైగా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. సినిమా టెక్నాలజీకి సంబంధించిన అనేక కొత్త అంశాలను పరిచయం చేశారు. సాహసాల కృష్ణగా నిలిచిపోయారు. హీరోగా అనేక రకాల పాత్రలు చేశారు. `అల్లూరి సీతారామరాజు`లా తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఒక ఇంటర్వ్యూ లో గాన గందర్వుడు ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం గారు సూపర్ స్టార్ కృష్ణ గారి మంచితనం గురించి తెలియచేసారు. అప్పట్లో అందరి హీరోలకు బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతూ ఉండేవారు.హీరోలు కూడా ఆయన పాటల కోసం వెయిట్ చేసి మరీ పాడించుకొనే వారు. అలాగే ఆయన గొంతులో మాడ్యులేషన్ వుండటం వల్ల అప్పటి నిర్మాతలు అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి కామెడీ యాక్టర్స్ కు కూడా బాలు గారితో పాడించే వారు.
అయితే కామెడీ యాక్టర్స్ కు పాడి తనకు పాడితే బాగోదని కృష్ణ గారు బాలు గారి తో వారికి పాడే విషయం లో ఆలోచించమని చెప్పారట. ఇక రాజబాబు తో స్నేహం కొద్దీ మళ్లీ వారికి బాలు గారు పాట పాడారాట. దానితో గిట్టని వాళ్లు కృష్ణ గారితో ఆయన మిమ్ముల్ని లెక్కచేయడం లేదని, లేని పోనివి చెప్పి బాలు గారిని చాలా రోజులు కృష్ణ గారి సినిమాల్లో పాడకుండా చేశారట. అలా ఇద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయని చెప్పారు.కాని మళ్లీ బాలు గారు స్వయంగా కృష్ణ గారి ఇంటికి వెళితే ఆప్యాయంగా పలకరించి,గుండెలకు హత్తుకుని మళ్లీ తన సినిమాల్లో పాడే అవకాశం ఇచ్చారని బాలు గారు చెప్పుకొచ్చారు.