Narendra Modi : ప్రధాని మోడీతో రిషి సునాక్‌ భేటీ.. కీలక నిర్ణయం

-

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ భేటీ అయ్యారు. ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సుకు ఇతర దేశాల అధినేతలు హాజరైయ్యారు. ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జి20 సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలుసుకున్న కాసేపటికే బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3,000 వీసాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. గతేడాది అంగీకరించిన యూకే-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్యంలో భాగంగా, ఈ పథకం నుంచి ఇలాంటి లబ్ధి పొందిన మొదటి దేశం భారతేనని అని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.

On G20 Summit day 1, Rishi Sunak among world leaders who interacted with PM  Modi | Latest News India - Hindustan Times

యూకే-ఇండియా యంగ్ ప్రొఫెనల్స్ పథకం కింద 18-30 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన భారత పౌరులు యూకే వచ్చి రెండేళ్లపాటు ఉండేందుకు 3 వేల వీసాలను అందిస్తున్నట్టు యూకే ప్రధాని కార్యాలయం ఓ ట్వీట్‌లో పేర్కొంది. బ్రిటన్ ప్రధాని సునాక్, భారత ప్రధాని మోదీ జి20 సమ్మిట్‌లో కలుసుకున్న కాసేపటికే బ్రిటన్ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. బ్రిటన్ పగ్గాలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కిన సునాక్.. మోదీని కలవడం ఇదే తొలిసారి. జి 20 సమ్మిట్‌లో యూకే, భారత ప్రధానులు కలుసుకుని మాట్లాడినట్టు మోదీ కార్యాలయం ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news