కరోనా బారినపడి గత పది రోజులుగా చెన్నై ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య సమాచారంపై వైద్యులు శనివారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్‌నే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఎస్పీబీ ఆరోగ్యం కొంతమేరకు మెరుగ్గానే ఉందని చెప్పారు.
ప్రస్తుతం కరోనా నుంచి కోలుకోవడానికి ప్లాస్మా చికిత్స అందిస్తున్నారని రెండు రోజులు వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. ఇదిలాఉండగా.. శనివారం తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ ఎస్పీబీని పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆయన వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి విజయభాస్కర్ పేర్కొన్నారు.