సోనూసూద్ ఆగ్రహం.. త్వరలోనే వారు అరెస్ట్..!

-

వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన సొంత ఖర్చులతో పంపించిన విషయం తెలిసిందే. అలాగే ఉపాధి కోల్పోయిన కార్మికులకు కూడా తానే ఉపాధి కలిపిస్తున్నాడు. అదేవిధంగా కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి కూడా సోనూసూద్ తన ఆపన్న హస్తాన్ని అందించారు. అలాగే కోరిన వారికి సాయం చేస్తూ.. ఈ కరోనా కష్ట కాలంలో అండగా నిలుస్తూ.. మానవత్వం చాటుకుని రియల్ హీరో గా పేరుతెచ్చుకున్న సోనూసూద్ కి ఇప్పుడు ఆగ్రహం వచ్చింది.

తన పేరుపై ఉన్న ఓ ఫేక్ ట్విట్టర్ అకౌంటే ఇందుకు కారణం. ఈ మేరకు ట్విట్టర్‌లో శుక్రవారం ఓ పోస్టు చేశాడు. ‘నా పేరున ఫేక్ ఖాతాను నిర్వహిస్తూ అమాయకులను మోసం చేస్తున్నావ్. త్వరలోనే కచ్చితంగా అరెస్టు అవుతావు మై డియర్. ఇప్పటికైనా ఇతరులను చీటింగ్ చేయడం మానుకో. బాగుపడుతావ్’ అంటూ సోనూ ఫేక్ ఖాతా నిర్వాహకులను హెచ్చరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news