ఊబకాయం ఉన్న కరోనా పేషంట్స్ లో రిస్క్ ఎక్కువగా వుంది: స్టడీ..!

ఊబకాయం ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కరోనా రిస్క్ ఎక్కువ కాలం ఉండేటట్టు కనబడుతోంది. సర్వే ప్రకారం ఒబిసిటీ లేని వాళ్ళ తో పోల్చుకుంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువ కాంప్లికేషన్స్ కనబడుతున్నాయని తెలుస్తోంది.

ఒబిసిటీ కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది దీని కారణంగా క్రానిక్ ఇన్ఫ్లమేటరీ వస్తుంది. కరోనా తగ్గిన తర్వాత కూడా ఒబిసిటీ కారణంగా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉందని స్టడీ చెబుతోంది. మధ్యస్తం మరియు ఎక్కువ ఒబేసిటీ ఉన్నవాళ్లలో లాంగ్ టైం కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా పేషెంట్ లో నార్మల్ బీఎంఐ ఉండే వాళ్ల కంటే ఒబిసిటీ ఉన్న వాళ్ల లో ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. 35 లేదా అంత కంటే ఎక్కువ బీఎంఐ ఉన్నవాళ్లలో డయాగ్నస్టిక్ టెస్టులు అవసరమని గ్యాస్ట్రో ఇంటెస్టినల్ మరియు మెంటల్ హెల్త్ సమస్యలు నార్మల్ బీఎంఐ పేషెంట్స్ తో పోల్చుకుంటే వీళ్లలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ఎక్స్పర్ట్స్ ఒబేసిటీ ఉన్నవాళ్లు హైపర్ ఇంఫ్లేమేషన్ మరియు మొదలైన సమస్యలు వస్తాయి అని అన్నారు. ఈ స్టడీలో 2839 పేషంట్స్ మీద రీసెర్చ్ చేయగా ఈ వివరాలు సేకరించారు.