తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్నారని ఈ నెల 7వ తేదీన బీజేపీ కి చెందిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగ నేడు హై కోర్టు సూచనలతో ఈ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. కాగ స్పీకర్.. బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు.
సస్పెన్షన్ కొనసాగుతుందని తెల్చి చెప్పారు. కాగ స్పీకర్ నిర్ణయం పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. హై కోర్టు సూచనలను, తమ అభ్యర్థలను స్పీకర్ తిరస్కరించారని తెలిపారు. అలాగే తమ భవిష్యత్తు కార్యాచరణను బీజేపీ కార్యాలయంలో చర్చించి వెల్లడిస్తామని ప్రకటించారు.
కాగ సభకు అడ్డుపడుతున్నారని స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసని తర్వాత బీజేపీ ఎమ్మెల్యే లు హై కోర్టును ఆశ్రయించారు. సస్పెన్షన్ స్టై పై హై కోర్టు నిరాకరించినా.. ఈ రోజు స్పీకర్ ను కలవాలని హై కోర్టు సూచించింది. అయితే స్పీకర్ దే తుది నిర్ణయమని హై కోర్టు తెల్చి చెప్పింది.