మహిళలకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల నుండి స్పెషల్ గా రుణాలు..!

-

ఇండియా లో ఎన్నో బ్యాంకులు వున్నాయి. చాలా బ్యాంకులు లోన్స్ ని కూడా ఇస్తూ ఉంటాయి. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో మహిళల కోసం స్పెషల్ స్కీమ్స్ ని తీసుకు వచ్చారు. ఈ స్కీముల తో లోన్స్ ని పొందొచ్చు. మహిళలు తాము పొందగల ఆర్థిక ప్రయోజనాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మహిళలకు ఇచ్చే స్కీముల గురించి చూద్దాం.

మహిళలు తమ ఆర్థిక స్వాతంత్య్రం సాధించేందుకు చాలా బ్యాంకులు ఆఫర్లని ఇస్తున్నాయి. వీటి వలన మహిళలకి ఉపయోగకరంగా ఉంటుంది. కెనరా బ్యాంక్ ఇతర రుణగ్రహీతలకు 9.25% వడ్డీతో రుణం ఇస్తుంటే.. మహిళా రుణగ్రహీతలకు మాత్రం 8.85% వడ్డీ తో హోమ్ లోన్ ని ఇస్తోంది. అదే దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలను తీసుకునే మహిళలకి వడ్డీ రేట్లపై 5 బేసిస్ పాయింట్ల రాయితీ ఇస్తోంది. ఇది కూడా మహిళలకి ప్రయోజనకరంగానే ఉంటోంది.

ఎన్‌బీఎఫ్‌సీలు మహిళలకు రాయితీతో కూడిన గృహ రుణ రేట్లను ఇస్తున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి చూస్తే.. మహిళలకు గృహ రుణాలపై 5 బేసిస్ పాయింట్ల తగ్గింపును ఇస్తోంది. వడ్డీ రుణ మొత్తం క్రెడిట్ స్కోర్ వంటి అంశాలపై ఆధారపడి వుంది. తక్కువ వడ్డీ రేట్లు ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే పొందవచ్చు. అలానే బజాజ్ ఫిన్‌సర్వ్ మహిళలకు ఎలాంటి పూచికత్తు లేకుండానే రూ. 40 లక్షల లోన్ ఇస్తుంది. ఇది ఇలా ఉంటే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కొన్ని ఒంటరి మహిళా రుణగ్రహీతలు లేదా వ్యాపారవేత్తల కోసం వ్యాపార రుణాలపై వడ్డీ రేట్లు ని కొన్ని ప్రత్యేక పథకాల ద్వారా ఇస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news