ఇవాళ సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా – ఆస్ట్రేలియా మద్య మూడో టి20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రెండు టింలు నిన్న సాయంత్రం 5:45 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. అయితే.. ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగే టి20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.
ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని 24 ప్రదేశాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ఆర్టీసీ బస్సులను నడిపించనున్నారు.
ఉప్పల్ రూట్, హయత్ నగర్, ఏన్.జి.ఓ కాలనీ, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, కోటి, దిల్ సుక్ నగర్, ఆఫ్జల్ గంజ్, మెహదీపట్నం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఉప్పల్ రూట్, ఘట్కేసర్-రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, బిహెచ్.ఈఎల్, జీడిమెట్ల, కెపిహెచ్బి, మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఈసిఐఎల్ క్రాస్ రోడ్స్, యూసఫ్ గూడ, బోయిన్పల్లి, చార్మినార్, చంద్రయానగుట్ట, కొండాపూర్ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.