రేపట్నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం.కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైసిపి తరపున పాల్గొన్నారు వైసిపి పార్లమెంటరీ పక్ష నేతలు విజయ సాయిరెడ్డి, మిథున్ రెడ్డి. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు వైసిపి ఎంపీలు.జిఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని సూచించారు.
ఏపీలో వరద పరిస్థితులపై పార్లమెంట్ లో చర్చ జరిపి ,ఆర్ధిక సహాయం అందించాలని కోరారు.ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు గురించి పార్లమెంట్ లో చర్చ జరపాలని సూచించారు.రుపాయి పతనం పై పార్లమెంట్ లో చర్చ జరపాలన్నారు.పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు విడుదల చేయాలని అన్నారు.కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు,జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు,ఉక్రెయిన్ మెడికల్ విద్యార్థులకు వైద్య విద్య కొనసాగించాలని అన్నారు.
జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే మెడికల్ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.జనాభా గణన త్వరగా పూర్తి చేయాలన్నారు.మహిళకు ఉద్యోగకల్పన పెంచాలని,మహిళలకు రిజర్వేషన్లు,మహిళా సాధికారత గురించి చర్యలు తీసుకోవాలన్నారు.మంకీ ఫాక్స్ వ్యాధి నివారణ కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.