BREAKING : పారిస్ ఒలింపిక్స్.. అంతిమ్‌ పంగల్‌ అక్రిడిటేషన్‌ రద్దు

-

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లకు అస్సలు కలిసిరావడం లేదు. ఇప్పటికే స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడగా.. తాజాగా భారత యువ రెజ్లర్‌ అంతిమ్‌ పంగల్‌ ఒలింపిక్స్‌ నుంచి ఔట్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఆమె తన సోదరిని ఒలింపిక్‌ గేమ్స్‌ విలేజ్‌లోకి తన అక్రిడిటేషన్‌తో పంపించడమేనని దీనికి కారణం. ఇప్పటికే అంతిమ్‌ అక్రిడిటేషన్‌ను నిర్వాహకులు రద్దు చేయగా.. ఆమెపై చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అంతిమ్‌ ఫ్రీస్టైల్ 53 కేజీల కేటగిరీలో క్వార్టర్స్‌లో తుర్కియే రెజ్లర్‌ యెట్‌గిల్ చేతిలో ఓడిపోయింది. అనంతరం ఆమె తన కోచ్‌లు ఉంటున్న హోటల్కు వెళ్లి.. క్రీడా గ్రామంలో ఉన్న తన వస్తువులను తీసుకురమ్మని తన సోదరి నిశాకు చెప్పింది. తన అక్రిడిటేషన్ కార్డును ఇచ్చి పంపింది. అయితే నిశా క్రీడా గ్రామంలోకి వెళ్లి వస్తువులను తీసుకొస్తుండగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని ఆమె నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. అంతిమ్‌ను కూడా పిలిపించి వివరణ తీసుకుని.. అంతిమ్‌ అక్రిడిటేషన్‌ దుర్వినియోగం అయినట్లు భావించిన ఒలింపిక్‌ నిర్వాహకులు దాన్ని రద్దు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news