భారత క్రికెట్ జట్టు సభ్యుడు మహమ్మద్ షమీకి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రకటించింది. భారత ప్రభుత్వం పలువురు క్రీడాకారులకు అవార్డులను ప్రకటించింది. భారత క్రికెట్ జట్టు సభ్యుడు మహమ్మద్ షమీకి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రకటించింది. భారతదేశం యొక్క రెండవ అత్యున్నత క్రీడా గౌరవం అర్జున అవార్డు. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనకు అర్జున అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. పురుషుల ప్రపంచ కప్ క్రికెట్ క్రికెట్ 2023 లో మహమ్మద్ షమీ అద్భుతమైన ప్రతిభను కనబర్చారు.
ఐసీసీ వరల్డ్ కప్ లో కేవలం ఏడు ఇన్నింగ్స్ లలో 24 వికెట్లతో మహమ్మద్ షమీ అగ్రస్థానంలో నిలిచాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 33 ఏళ్ల కుడిచేతి పేసర్ వన్ డే క్రికెట్ లో 19 ఇన్నింగ్స్ లలో 43 వికెట్లను సాధించాడు. రెడ్ బాల్ క్రికెట్ లో నిలకడగా ఆయన ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఈ ఏడాది భారత జట్టును ప్రపంచంలో నెంబర్ వన్ జట్టుగా నిలబెట్టడంలో మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు.