శ్వేతపత్రం కాగ్ నివేదిక ఆధారంగా రిలీజ్ చేశాం : సీఎం రేవంత్ రెడ్డి

-

ప్రపంచంతో పోటీ పడే విధంగా రాష్ట్రాన్ని తయారు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ఐదేండ్ల నుంచి ఆర్బీఐ దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది. తాజాగా ప్రభుత్ం విడుదల చేసిన శ్వేత పత్రం ఎవ్వర్నో కించపరచడానికి కాదు. శ్వేతపత్రం కాగ్ నివేదిక ఆధారంగా రిలీజ్ చేశామని తెలిపారు. సమర్థవంతమైన పాలన అందించేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 

రెవెన్యూ విషయంలో కాగ్ నివేదికను పరిగణలోకి తీసుకున్నాం. 2014-15 లో ఆర్బీఐ దగ్గర మనకు మిగులు బడ్జెట్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ కార్యచరణ ప్రకటించేందుకే శ్వేత పత్రం విడుదల చేశాం. ఉద్యోగులను కూడా మోసగాళ్లుగా కించపరచారు.  42 పేజీల నివేదికలో ఏ నాయకుడిని దూషించలేదు. ఇచ్చిన మాటను జిమ్మెదారితో నిలబెట్టుకుంటాం. సెక్రటేరియట్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ పరంగా మేము బీజేపీని వ్యతిరేకిస్తాం. కానీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసి కోరినట్టు అసెంబ్లీలో తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news