Asia Cup 2022 : బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన శ్రీలంక

-

 

 

ఆసియా కప్ లో శ్రీలంక జట్టు మళ్లీ పుంజుకుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై ఓడిన శ్రీలంక.. నిన్న బంగ్లాదేశ్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ బి మ్యాచ్ లో శ్రీలంక ఏకంగా రెండు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరి రెండు ఓవర్లలో గెలుపు కోసం 25 పరుగులు చేయాల్సి ఉండగా… బంగ్లా విజయం ఖాయం అనిపించింది.

కానీ 19 ఓవర్ వేసిన ఇభాదత్ ఏకంగా 17 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో శ్రీలంక విజయం సాధించింది. ముందుగా బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని శ్రీలంక జట్టు చాలా కష్టపడి చేదించింది. 19.3 ఓవర్లలో ఏకంగా 8 వికెట్లు కోల్పోయి… శ్రీలంక లక్ష్యాన్ని చేదించింది. ఈ విజయంతో సూపర్ 4 బరిలోకి దూసుకుపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news