టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పేసాడు. గత ఏడాది ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో సెమి ఫైనల్ లో చివరి మ్యాచ్ ఆడిన ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కి అప్పటి నుంచి దూరంగా ఉన్నాడు. ఐపిఎల్ లో మాత్రమే ధోనీ ఆడటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కి సారధ్యం వహిస్తున్న ధోనీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేసాడు.
2007 టి20 ప్రపంచకప్ తో పాటుగా 2011 వన్డే ప్రపంచకప్, అలాగే చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ లలో టీం ఇండియాను నెంబర్ గా నిలిపాడు ధోనీ.తనకు ఇన్ని రోజులు మద్దతు ఇచ్చిన అభిమానులకు ధోనీ ధన్యవాదాలు తెలిపాడు. గంగూలీ సారధ్యంలో అతను టీంలోకి అడుగు పెట్టి ఎన్నో రికార్డ్ లను తన ఖాతాలో వేసుకున్నాడు.