ఐపిఎల్ ఫైనల్ కు వెళ్ళేది ఆ రెండే: బ్రెట్ లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ లో ఫైనల్ కు ఎవరు వెళ్తారు అనే దానిపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రెట్ లీ తన అభిప్రాయం చెప్పాడు. 2020 ఐపిఎల్ సెప్టెంబర్ 19 న ప్రారంభమవుతున్న నేపధ్యంలో… ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. దీనిపై బ్రెట్ లీ సోషల్ మీడియాలో స్పందించాడు. ఎవరు ఫైనల్ కి వెళ్తారు అనేది తన అభిప్రాయం చెప్పాడు.

తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఈ సంవత్సరం ఐపిఎల్‌ను ఎవరు గెలుచుకోగలరు అని అడిగినప్పుడు… చెప్పడం చాలా కష్టం అంటూనే… ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎస్‌ కే గెలిచే అవకాశం ఉందని లీ చెప్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని, ఈసారి ఫైనల్‌-4లో కేకేఆర్‌ కచ్చితంగా ఉంటుందన్నాడు. గతంలో అతను కేకేఆర్ కు ఆడిన సంగతి తెలిసిందే.