Mumbai Indians : ముంబై జట్టును ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మను ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పించి హార్థిక్ పాండ్యన్ కెప్టెన్ గా ఎన్నుకున్నారు. ఈ ప్రభావం ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలపై పడుతుంది. తమ అభిమాన ఆటగాడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం పలువురు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు రోహిత్, పాండ్యా మధ్య గొడవలు ఉన్నాయని కొత్త మంది ప్రచారం చేస్తున్నారు.
అయితే.. ఈ విషయంపై యూవీ స్పందించారు. రోహిత్, హార్దిక్ మధ్య వివాదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని యువీ సూచించాడు. ముంబైతో పాటు భారతజట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న వారిద్దరి మధ్య ఏమైనా ఈగో సమస్యలు ఉంటే, వాటిని పక్కన పెట్టి దేశం కోసం గొప్పగా పోరాడాలని యువరాజ్ సింగ్ అన్నారు. రోహిత్ గొప్ప నాయకుడు.
అతడు అయిదు ఐపీఎల్ ట్రోఫీలను సాధించాడు. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో జట్టును ఫైనల్ కు చేర్చాడు. ఐపీఎల్, టీమ్ ఇండియా అత్యుత్తమ సారధుల్లో రోహిత్ ఒకరు. అయితే అతడి వర్క్ లోడ్ గురించి కూడా మనం ఆలోచించాలి. ఇక ఆటగాళ్లు కలిసి ఆడుతున్నప్పుడు గొడవలు జరుగుతుంటాయి. అయితే హార్దిక్-రోహిత్ మధ్య సమస్య ఉంటే దాని గురించి వారు కూర్చొని తప్పక మాట్లాడుకోవాలని సూచించారు.