వినేశ్‌ పతకానికి దూరం కావడానికి అదే కారణం : రెజ్లింగ్‌ కోచ్

-

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్కు గోల్డ్ పక్కా అని అంతా భావిస్తున్న సమయంలో అనర్హత వేటుకు గురైన వినేశ్‌ ఫొగాట్‌ చివరికి రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 100 గ్రాముల అదనపు బరువుతో ఫైనల్‌కు ముందు ఆమెపై అనర్హత వేటు పడింది. వినేశ్ అనర్హతకు కారణం భారత రెజ్లింగ్‌ సమాఖ్య తీరే కారణమని కోచ్‌ క్రిపా శంకర్ ఆరోపించారు. గతంలో ఎప్పుడూ వినేశ్‌కు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని అన్నారు.

స్వల్ప వ్యవధిలో రెండుసార్లు బరువును తూచుకోవాల్సిన అవసరం రాలేదని అందుకే, డొమిస్టిక్‌లోనైనా రెజ్లర్లకు అప్పుడప్పుడు అమలుచేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సగంసగం రూల్స్‌తో నడపొద్దని చెప్పినందుకు ఆరేళ్లపాటు తనను సస్పెండ్ చేశారని వాపోయారు. ఒక్క రోజు వ్యవధిలో బరువును తగ్గించుకోవడం చాలా కష్టమన్న క్రిపా శంకర్.. దానికి ఎంతో ప్రాక్టీస్‌ అవసరమన్నారు. చూసేందుకు ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తున్నా.. దేశానికి పతకం చేజారేందుకు కారణమైందని వ్యాఖ్యానించారు. అందుకే, రెజ్లర్ల కోసం సరైన వ్యవస్థను అమలు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news