అందంగా ఉందని.. పారిస్ ఒలింపిక్స్ నుంచి పంపేశారు

-

పారిస్‌ ఒలింపిక్స్‌లో భాగంగా ఓ క్రీడాకారిణి తీరు వివాదాస్పదమైంది. అందంగా ఉందన్న కారణంతో ఆమెను ఒలింపిక్స్ నుంచి బయటకు పంపేశారు. తన అందం వల్ల తోటి క్రీడాకారులు తమ ఆటపై ఫోకస్ పెట్టలేకపోతున్నామని ఫిర్యాదు చేయడంతో ఆ దేశ అధికారులు.. ఒలింపిక్స్‌ గ్రామం నుంచి ఆమెను స్వదేశానికి పంపించారు.

పరాగ్వేకు చెందిన లువానా అలోన్సో (20) జులై 27న జరిగిన 100 మీటర్ల ఉమెన్స్‌ బటర్‌ఫ్లై స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొని ఓడిపోయింది. అయితే పోటీలు ముగిసేవరకు ఆమె పారిస్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమె అందం అక్కడున్న తోటి క్రీడాకారులను ఆకర్షించింది. అయితే పరాగ్వే పురుష క్రీడాకారులు లువానా అందం వల్ల తమ ఆటపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామంటూ ఫిర్యాదు చేయడంతో పరాగ్వే బృందం ఆమెను స్వదేశానికి పంపించింది. పారిస్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న లువానా.. మరుసటి రోజే స్విమ్మింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి అందర్నీ షాక్‌కు గురిచేసింది. అయితే, ఒలింపిక్స్‌లో చోటుచేసుకున్న వివాదంపై మాత్రం ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news