బ్రేకింగ్: ఢిల్లీ జట్టులో కరోనా కేసులు

ఐపిఎల్ ని కరోనా వైరస్ వదలడం లేదు. కరోనా కేసులతో పలు జట్లు కంగారు పడుతున్నాయి. ఎల్లుండి నుంచి ఈ టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో కొంత మంది ఆటగాళ్ళు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఢిల్లీ కేపిటల్స్ ఆటగాడు డేవిడ్ విల్లి కరోనా బారిన పడ్డాడు. అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఢిల్లీ యాజమాన్యం ప్రకటన చేసింది. ఇంగ్లాండ్ కి చెందిన డేవిడ్ విల్లి లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్.

ఇప్పటికే పలువురు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ళు ఈ ఏడాది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఎల్లుండు చెన్నై ముంబై జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అబుదాబి వేదికగా ఈ మ్యాచ్ ని నిర్వహిస్తున్నారు. జట్లు అన్నీ కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు.