కష్టాల్లో క్రికెట్ దేశాలు…!

-

కరోనా వైరస్ ప్రభావం క్రికెట్ మీద చాలా బలంగా పడింది అనేది వాస్తవం. క్రికెట్ ని నమ్ముకున్న చిన్న చిన్న దేశాలు ఇప్పుడు ఆర్ధికంగా అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. మన దేశంలో క్రికెట్ నాలుగేళ్ళు ఆడకపోయినా మన బోర్డ్ ఆటగాళ్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. భారీగా నిధులు ఉండి ధనిక బోర్డ్ కూడా. చిన్న చిన్న దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ దేశాలు బాగా ఇబ్బంది పడుతున్నాయి.

వెస్టిండీస్ గత నాలుగు నెలల నుంచి ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు ఇవ్వడం లేదు. ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా చెప్పడం లేదు. ఇక జింబాబ్వే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆటగాళ్లకు కనీసం హోటల్ సదుపాయం కూడా కల్పించలేని పరిస్థితిలో ఉన్న ఆదేశం ఆటగాళ్లకు చిన్న చిన్న వస్తువులను కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. దేశవాళీ మ్యాచ్ లకు భద్రత కూడా కల్పించలేని పరిస్థితిలో ఉంది ఆ దేశం.

ఇక శ్రీలంక క్రికెట్ గత కొన్నాళ్ళు గా బాగా ఇబ్బంది పడుతుంది. ఆ దేశంతో క్రికెట్ ఆడటానికి ఎవరూ కూడా ముందుకి రావడం లేదు. ఆ దేశంతో క్రికెట్ ఆడిన దేశాలు అన్నీ కూడా నష్టపోయాయి. ఇక బంగ్లాదేశ్ తో ఇప్పుడు అగ్ర జట్లు ఏ ఒక్కటి ఆడే పరిస్థితి లేదు. ఆడితే శ్రీలంక, జింబాబ్వే లేదా పాకిస్తాన్ మాత్రమే ఆడాలి. వాళ్ళు మినహా ఏ ఒక్కటి కూడా ఆ దేశ౦తో ఆడటానికి ముందుకు రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news