సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రాణించారు. దీంతో సౌతాఫ్రికా 287 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న ప్రసిద్ధ కృష్ణ, దీపక్ చాహార్ తో పాటు బుమ్రా అద్భుతంగా రాణించారు. ప్రసిద్ధ కృష్ణ 3 వికేట్లు తీశాడు. అలాగే దీపక్ చాహార్, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. అలాగే చాహల్ కూడా ఒక వికెటు తీశాడు. దీంతో ఇన్నింగ్స్ లో చివరి బంతి మిగిలి ఉండగా సౌతాఫ్రికా ఆలౌట్ అయింది.
అయితే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ మెన్లు కూడా బాగానే రాణించారు ఓపెనర్ డికాక్ (124) శతకం బాదీ జట్టు భారీ స్కోరు కు కారణం అయ్యాడు. డస్సెన్ (52), మిల్లర్ (39) కూడా రాణించారు. అయితే ఇన్నింగ్స్ మొదట్లోనే సౌత్ ఆఫ్రికా కు భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. మూడో ఓవర్లోనే మలన్ ను బుమ్రా అవుట్ చేశాడు. తర్వాత వెనువెంటనే మరో రెండు వికెట్లు పడ్డాయి. కానీ నాలుగో వికెటుకు డికాక్, డస్సెన్ 144 పరుగుల భాగాస్వామ్యాన్ని నిలిపారు. దీంతో 287 వరకు వెళ్లింది. కాగ భారత్ విజయం సాధించాలంటే.. 288 పరుగులు చేయాల్సి ఉంటుంది.