ఆస్ట్రేలియా టూర్: భారత జట్టులోకి మరో బౌలర్ వచ్చేస్తున్నాడు.

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియాతో జరగనున్నమ్యాచులకి సిద్ధం అవుతోంది. ఐపీఎల్ ముగిసిన అనంతరం క్రికెట్ అభిమానులకి వినోదం అందించడానికి వస్తున్న ఈ సిరీస్ పై అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఐతే టీ ట్వంటీ, వన్డేలతో పాటు టెస్టు సిరీస్ కూడా జరగనుంది. ఈ టెస్టు మ్యాచులకి కోహ్లీ హాజరు కాలేకపోతున్నాడు. మొత్తం నాలుగు టెస్టు మ్యాచుల్లో కేవలం ఒక టెస్ట్ మాత్రమే ఆడి, పితృత్వ సెలవులు తీసుకుని ఇండియాకి తిరిగి వచ్చేస్తున్నాడు.

ఐతే కోహ్లీ వెళ్ళిపోతున్నప్పటికీ జట్టులోకి రోహిత్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన మరో సమాచారం ప్రకారం భారత బౌలర్ ఇషాంత్ శర్మ రానున్నాడట. ప్రస్తుతం బెంగళూరులో ప్రాక్టీసు చేస్తున్న ఇషాంత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు మ్యాచులకి ఆడతాడని తెలుస్తుంది. మరి సీనియర్ అయిన ఇషాంత్ శర్మ ఏ విధంగా ప్రభావం చూపుతాడో చూడాలి.