దుబాయ్ వేదిక టీ ట్వంటి వరల్డ కప్ లో భాగంగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. కాగ ఆస్ట్రేలియా టాస్ నెగ్గి పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఆహ్వానించింది. అయితే పాకిస్థాన్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్ట పోయి176 పరుగులు చేసింది. ముందుగా పాకిస్థాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ 67(52) తో పాటు బాబర్ అజామ్ 39 (34) శుబారంభం ఇవ్వడంతో మంచి ప్రారంభం లభించింది.
వీరు ఇద్దరు మొదటి వికెట్ కు 71 పరుగులు జోడించారు. తర్వా బ్యాటింగ్ కు వచ్చిన ఫఖర్ జామాన్ 55 (32) కూడా ధాటి గా ఆడారు. ఫఖర్ జామాన్ చివర్లో వరుసగా సిక్స్ లు కొట్టడం తో భారీ స్కోర్ చేయకలిగింది. ఈ మ్యాచ్ లో ఫఖర్ జమాన్ 4 సిక్స్ లు 3 ఫోర్ లు బాదాడు. తర్వాత వచ్చిన అసీఫ్ అలీ గోల్డెన్ డక్ అవుట్ తో వెనుతిరిగాడు. తర్వాత షోయబ్ మాలిక్ కూడా సింగిల్ పరుగుకే అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ 2 వికెట్లు తీశాడు.అలాగే ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసుకున్నారు. కాడ ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 177 పరుగులు సాధించాలి.