ఇండియా వేదికగా 2024 లో జరగనున్న వన్ డే వరల్డ్ కప్ కు సంబంధించి పాకిస్తాన్ ఇక్కడ మ్యాచ్ లు ఆడబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించడానికి ఐసీసీ రంగంలోకి దిగి పాకిస్తాన్ మ్యాచ్ లను బంగ్లాదేశ్ లో తటస్థ వేదికగా అందించాలని నిర్ణయించింది. కానీ ఈ విషయంపై కొంతకాలం సైలెంట్ గా ఉన్న పాకిస్తాన్ తాజాగా ఈ విషయంపై మాట మార్చినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తాము ఆడే మ్యాచ్ లను ఇండియాలోనే ఆడుతాము, కానీ కేవలం రెండు వేదికలలోనే ఆడుతామని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.