అశ్విన్ ఆడకపోవడంతో వాళ్ళు నవ్వుకుని ఉంటారు.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్.

ఇండియా, ఇంగ్లండ్ మధ్య మొదటి టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాటింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో మొదటి ఇన్నింగ్సులో ఇంగ్లండు జట్టు 183పరుగులకే కుప్ప కూలింది. బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 4వికెట్లు తీసుకుని ఇంగ్లండ్ ని చతికిల పడేలా చేసాడు. ఐతే ఈ మ్యాచులో రవిచంద్రన్ అశ్విన్ ఆడలేదు. నలుగురు పేసర్లని తీసుకున్న కోహ్లీ, ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజాని ఎంచుకున్నాడు. ఈ విషయమై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టీవ్ హార్మిసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

అశ్విన్ ఈ మ్యాచు ఆడకపోవడంపై ఇంగ్లండు ఆటగాళ్ళు నవ్వుకుని ఉంటారని, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ లేకపోవడం కొంత మేలే జరిగిందని, ఒకవేళ ఆడి ఉంటే ఇంగ్లండ్ స్కోరు మరింత తక్కువే అయ్యి ఉండేదేమో అన్న ఉద్దేశ్యంలో అశ్విన్ ఆడకపోవడం వల్ల నవ్వుకుని ఉంటారని హార్మిసన్ అన్నారు. ప్రస్తుతం ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలైంది.