మళ్లీ విజృంభించిన కరోనా.. లక్షన్నర కొత్త కేసులు!

-

అమెరికా: కరోనా వైరస్ మళ్లీ విజృంభించింది. గతేడాది విషాదాలను మర్చిపోకముందే మళ్లీ వ్యాప్తి చెందుతోంది. దీంతో అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ కేసులు ఇటీవల మరింత పెరిగాయి. ఒక్క రోజే సుమారు లక్షన్నర కేసులు నమోదు అయ్యాయి. 668 మంది చనిపోయారు.

గత వారం ప్రపంచంలో నమోదు అయిన కేసుల్లో కూడా అమెరికానే ముందుంది. ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్, వంటి రాష్ట్రాల్లో కరోనా పడగవిప్పింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం అమెరికా వ్యాప్తంగా గత రెండు రోజులుగా లక్షకు పైగా మంది కరోనా బారిన పడటంతో అగ్రరాజ్యం వాసుల్లో కలవరం మొదలైంది. ఇప్పటివరకూ అమెరికాలో మొత్తం 3 కోట్ల 53 మందికి కరోనా సోకింది. 6 లక్షల 14 వేల మంది చనిపోయారు. అమెరికాలో చాలా ప్రాంతాల్లో టీకా పంపిణీ ఆలస్యం కావడమే ఇందుకు కారణమని అక్కడి వైద్యారోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో టీకా పంపిణీని ముమ్మరం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news