ఈ ద‌శాబ్దికి మెన్స్ వ‌న్డే జ‌ట్టును ప్ర‌క‌టించిన ఐసీసీ.. కెప్టెన్‌గా ధోనీ..!

-

ఈ ద‌శాబ్దానికి గాను ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మెన్స్ వ‌న్డే టీంను ప్ర‌క‌టించింది. ప్ర‌పంచంలోని ప‌లు ఇత‌ర క్రికెట్ ఆడే దేశాల‌కు చెందిన ప్లేయ‌ర్ల‌తోపాటు మొత్తం 11 మందితో కూడిన జ‌ట్టును ఐసీసీ ప్ర‌క‌టించింది. కాగా ఈ జ‌ట్టుకు ఎంఎస్ ధోనీని ఐసీసీ కెప్టెన్‌గా ప్ర‌క‌టించింది. ధోనీ నేతృత్వంలో భార‌త్ 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన విష‌యం విదిత‌మే. ఇక ఈ జ‌ట్టుకు ధోనీ కెప్టెన్‌గా ఉండ‌డంతోపాటు వికెట్ కీప‌ర్‌గా కూడా స్థానం సంపాదించాడు.

icc announces playing xi of this decade for odi mens team

కాగా ఐసీసీ ప్ర‌క‌టించిన ఆ జ‌ట్టులో మ‌రో ఇద్ద‌రు ఇండియ‌న్ క్రికెట్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌ల‌కు చోటు ల‌భించింది. కోహ్లి ఈ ద‌శాబ్దిలో 211 వ‌న్డేల్లో 61.76 స‌గ‌టుతో 10,561 ప‌రుగులు చేయ‌గా, వాటిల్లో 39 సెంచ‌రీలు ఉన్నాయి. ఇక రోహిత్ శ‌ర్మ వన్డే క్రికెట్‌ళో 3 డ‌బుల్ సెంచ‌రీలు సాధించిన ఏకైక ప్లేయ‌ర్‌గా నిలిచాడు. అలాగే వ‌న్డేల్లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు రికార్డు కూడా రోహిత్ శ‌ర్మ పేరిటే ఉంది. రోహిత్ వ‌న్డేల్లో అత్య‌ధికంగా 264 ప‌రుగుల స్కోరు చేశాడు. ఈ క్ర‌మంలోనే కోహ్లి, రోహిత్‌ల‌కు ఆ జ‌ట్టులో స్థానం ల‌భించింది.

ఇక జ‌ట్టులో మిగిలిన ప్లేయ‌ర్ల‌లో ఆస్ట్రేలియాకు చెందిన వార్న‌ర్‌, మిచెల్ స్టార్క్‌, సౌతాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియ‌ర్స్‌, ఇమ్రాన్ తాహిర్‌, బంగ్లాదేశ్‌కు చెందిన ష‌కిబ్ అల్ హ‌స‌న్‌, ఇంగ్లండ్‌కు చెందిన బెన్ స్టోక్స్‌, న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్‌, శ్రీ‌లంకకు చెందిన ల‌సిత్ మ‌లింగ‌లు నిలిచారు. వీరు ఈ ద‌శాబ్ది కాలంలో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌నను వ‌న్డేల్లో క‌న‌బ‌రిచారు. అందుకే ఐసీసీ వీరిని ఈ దశాబ్ద‌పు వ‌న్డే మెన్స్ టీంలో చేర్చింది.

Read more RELATED
Recommended to you

Latest news