CSK దీపక్ చహార్: ముంబై తో ఫైనల్ ఆడితేనే అసలైన మజా…

-

ఐపీఎల్ లో ఇప్పుడు ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి, చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు చేరుకోగా .. ఫైనల్ కు చేరడానికి రేపు సాయంత్రం గుజరాత్ లో గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ లు తలపడనున్నాయి. లీగ్ స్టేజ్ లో అద్భుతంగా ఆడుతూ వచ్చిన గుజరాత్ … క్వాలిఫైయర్ 1 లో మాత్రం చెన్నై చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇక రేపు జరగనున్న మ్యాచ్ లో గెలిచిన జట్టు చెన్నైతో ఫైనల్ లో ఆడనుంది. కాగా చెన్నై ప్లేయర్ దీపక్ చాహర్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రేపు జరగబోయే మ్యాచ్ లో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ విజయం సాధించి ఫైనల్ కు చేరుకోవాలని దీపక్ కోరుకుంటున్నాడు. ముంబై ఇండియా లాంటి కఠినమైన ప్రత్యర్థితో ఫైనల్ లో ఆడితేనే మజా ఉంటుందని కామెంట్ చేశాడు.

ఎవరు ఫైనల్ కు చేరినా మేము ఆడి గెలుస్తామని, ముంబై వస్తే ఇంకా బాగుటుందని అన్నాడు. మరి దీపక్ చాహర్ కోరికను రోహిత్ శర్మ సేన తీరుస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news